గుంటూరు జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు... 15 పడకలతో ఐసోలేషన్ వార్డు సిద్ధం!
Tue Jun 03, 2025 12:36 Health, India
గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ మళ్లీ కలకలం రేపుతోంది. తాజాగా గుంటూరు నగర పరిధిలో రెండు కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ విజయలక్ష్మి నిన్న వెల్లడించారు. దీంతో జిల్లా వాసుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటివరకు తెనాలి, ఉండవల్లి వంటి ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన కొవిడ్ కేసులు ఇప్పుడు గుంటూరు నగరంలోకి కూడా విస్తరించడం గమనార్హం. కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన ఇద్దరు బాధితులను జీజీహెచ్ ఆసుపత్రికి తరలించి, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. కొవిడ్ అనుమానిత లక్షణాలతో బాధపడుతున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు జీజీహెచ్ క్యాజువాలిటీ విభాగం సమీపంలో ప్రత్యేకంగా అవుట్ పేషెంట్ (ఓపీ) విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఓపీ విభాగంలో రోజుకు కనీసం వంద మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. కరోనా సోకిన రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు జీజీహెచ్‌లో ప్రత్యేక ఐసోలేషన్ వార్డును కూడా సిద్ధం చేశారు. బీ క్లాస్ వార్డులో 15 పడకలతో ఈ ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశామని, ఇందులో వెంటిలేటర్లతో పాటు నిరంతర ఆక్సిజన్ సరఫరా వ్యవస్థను కూడా అందుబాటులో ఉంచామని డాక్టర్ విజయలక్ష్మి వివరించారు. ప్రజలు కొవిడ్ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు.
ఇది కూడా చదవండి: టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు కీలక బాధ్యతలు అప్పగించిన కేంద్రం! ఎన్డీఏ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
నోటీసులకు స్పందించని అమెరికా.. రాయితీలకు కోత విధించే యోచనలో భారత్!
భారత్‌తో వాణిజ్య ఒప్పందం ఎంతో దూరంలో లేదు! ఇరు దేశాలకు ఆమోదయోగ్యమైన..!
లాస్ ఏంజెల్స్‌లో మహానాడు సందడి! వైభవంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు!
అమెరికాలో మెరిసిన తెలుగు తేజం..! మిస్ అండ్ మిసెస్ తెలుగు యూఎస్‌ఏ రన్నరప్‌గా గుడివాడ అమ్మాయి!
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రం సమీక్ష..! ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
Whatsapp group
Telegram group
Facebook group
#AndhraPravasi #Covid-19 #guntur #StaffTestPositive #AndhraPradesh #APnews
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
Disclaimer
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.